Saturday, September 19, 2009

ప్రకృతి- పురుషుడు

చావుకు భయపడడం మనుషులలో అతి సహజం,
బ్రతుకుకు భయపడి చస్తే కాదా అది హాస్యం.

చుట్టూ ప్రకృతిని ఒక్కసారి చూడు పరీక్షగా,
బ్రతకడం నేర్పుతుంది నీకు ఒక పెద బాల శిక్షలా.

ఉలి దెబ్బ తగలని రాయి శిల్పం అవుతుందా??
కష్టాల కొలిమిలో పడందే  నీ  తెలివి పదునెక్కుతుందా???

విత్తుని పూడ్చేస్తే  అవుతుందా మరి  సమాధి,
సత్తువతో నేల  చీల్చి చెట్టై రాదా అది .
స్వేదం చిందించి కరిగించు నీకు ఎదురైన అవరొధిని,
నిర్వేదం తరిమిస్తే  చేరుకోగలవు నీ పరమావధిని .

మోయలేని మేఘాల భారం తన పై మోపినా,
మౌనంగా రోదించు  తప్ప మిన్ను విరిగి  పడదుగా!!
లెక్కలేని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా,
మౌనంగా భరించు తప్ప గుండె బలం కోల్పోకురా!!  
బాధలన్ని  భరిస్తే కాదా ఆకశం హరివిల్లును కాన్చేది,
కష్టాలన్ని దాటితే కదా నువ్వు ఇలలో స్వర్గం చూసేది.

 మలుపులెన్నో వున్నవని  పోనంటుందా నది ముందుకు,
అలుపన్నది లేకుండా సాగదా ,పంటకు ప్రాణం అయ్యేందుకు.
ఈ జీవన పయనం లో మలుపులు లెక్క చేయకు  మిత్రమా!
నలుగురికి మంచి చేస్తూ సాగిపో స్నేహమా !!
ఆ నలుగురే నీకు కష్ట సుఖాలలో తోడైతారు,
బ్రతికేందుకు బాసటగా నిలుస్తారు ......



P.S: IF U LIKE IT LEAVE A COMMENT, IF U DONT LIKE THEN WRITE A COMMENT CRITICIZING THE POST. BUT DONT FORGET TO GIVE A COMMENT......

Friday, September 11, 2009

జీవితం

అనగనగనగా ఒక అందమయిన పక్షి
కనులు తెరిచి చూడగా కాంతి రేఖ తగిలింది
అంధకారమైన లోకం అత్యద్భుతం అయ్యింది
నింగికేసి చూడగా కాంతి బంతి కనిపించెను
కళ్ళు బైర్లు కమ్మిన రెప్ప వేయనేలేదు
మాయ తనను కమ్మింది
ఆకర్షణ కు లోనైంది
మోహం మనసును లాగింది
సూర్యుడినే వలచింది
ఏమీ తెలియని అమాయకత్వం,
ఏదో తెలియని ఆవేశం
వడి వడి అడుగులు వేయించాయి
నింగికేసి ఎగిరింది సూర్యుడికై వెళ్ళింది
ఆ మైకం లో అలసట తెలియలేదు
ఆ యాత్ర లో సూర్యుడే చేరువ అయ్యాడు
కాని ఇంతలో....
ఆ భగ భగ మంటలు తనువును తాకెను
రెక్కలు కాలి బూడిదయ్యెను
నేల పై పడింది నింగికెగసిన నీడజ

కొన్ని రోజుల తర్వాత...

కాలం గాయలను మాన్చింది
కాని ఆశను చంపలేకపోయింది
వద్దని ఎందరు వారించిన
విననన్నది తన మనసు
చెయ్యలేని పని ఏదీ లేదంది
అకుంఠిత దీక్షతో చేసి చూపుతానన్నది
మొక్కోవోని స్థైర్యంతో మళ్ళి మొదలెట్టింది
అనుభవాలు తోడురాగా నింగికి ఎగిరింది
అలుపన్నది లేకుండా అలసట రానీయకుండా
గెలుపే ధ్యేయంగా ఏ త్యాగానికైనా సిద్ధంగా
ఏ తడబాటు లేకుండా అడుగులు వేసింది
కానీ...........
దివాకరుడు మళ్ళి దహించాడు
కోరుకున్న కాంతే కన్నెర్ర చేసింది
కోలుకోలేనంతగా దెబ్బ తీసింది
తారవ్వాలని వెళ్ళింది తోకచుక్కలా రాలింది

ఈసారి..

పెద్ద వాళ్ళ మాట తో నిజం గుర్తెరిగింది
సూర్యుడైనా చంద్రుడైనా వెలుగొక్కటే అని తెలుసుకుంది
చంద్రుడికై వెళ్ళింది చల్లగా చేరింది..............

అనుభవాలతో పాఠాలు నేర్చినందుకు గెలుపనుకోవాలా??
కోరింది దక్కనందుకు ఓటమి అనుకోవాలా??
దక్కినదే కోరుకుంటున్నందుకు రాజీ అనుకోవాలా??

 

Saturday, September 5, 2009

రాజశేఖరుడికి అశ్రు నీరాజనం

అభివృద్ది పేరు చెప్పి రైతన్నను వెలేస్తే
దిక్కులేక్క ఏడ్చి ఏడ్చి విషం తాగి చచ్చాడు
గుండె పగిలి రైతు కోసం కాలి బాట పట్టావు
పల్లె పల్లె వెళ్లి వాళ్ళ కడుపు కోత విన్నావు
నేనున్నానంటూ గుండె ధైర్యం ఇచ్చావు
అన్నదాతకే ఆకలైతే పుట్టగతులు లేవన్నావు
ఆఖరి ఆశగా నీకు పట్టం కడితే
నమ్మకం వమ్ము చేయక మాట నిలబెట్టుకున్నావు
పగ్గాలు అందగానే ఉచిత విద్యుత్తిచ్చావు
పురుగు పట్టి పంట చెడి అప్పులపాలై రైతు
ఆత్మాభిమానం చంపుకోలేక తనను తాను చంపుకుంటే
అందరు నివ్వెర పోయేలా రుణ మాఫీ చేసావు
లెక్కలేని డ్యాములు కట్టి నేల తల్లి గొంతు తడిపావు
ఆకలి రాజ్యాన్ని అన్నపూర్ణను చేసావు
రైతే రాజని రైతు పక్షపాతివయ్యావు
పొట్టచేత పట్టి జనం వలస పోతుంటే
ఆగండి ఆగండి అంటూ పని ఇచ్చి పొట్ట నింపావు
ఇల్లు లేక పేదవాడు ఎండ వానకు ఏడిస్తే
ఇందిరమ్మ గృహాలిచ్చి ఇంటి వాడిని చేసావు
డబ్బు లేక జనం జబ్బులతో చస్తుంటే
ఆరోగ్యశ్రీ మొదలెట్టి ప్రాణ దాతవయ్యవు
మంచి రోజులోచ్చాయిని మళ్లీ నిను ఆశగా గెలిపిస్తే
మోసం చేసి నీ దారి నువ్వ్వు చూసుకుంటావా???
అధ్యక్షా అంటూ మా బాధలకు గళం ఇచ్చే గొంతు మాకు లేకుండా చేస్తావా??
ఆ స్వచ్చమైన నవ్వు మాకు లేకుండా చేస్తావా ??
తగునా నీకు ఇది తగునా. ......
తనకు పోటీ అంటూ దేవుడే నిన్ను మాయం చేస్తే
రావా మరణాన్ని ఎదిరించి రావా....
నీవు లేక జనం దిక్కు లేని వాళ్ళై వెక్కి వెక్కి ఏడుస్తుంటే ...
మా మాట విననని మా కంటనీరు ఆపుటకైనా రావా .....................

అంత వెలుగు వెలిగే సూర్యుడైనా అస్తమిస్తాడు కదా ....
అస్తమించడానికి నువ్వు ఆకాశంలో సూర్యుడివా!!!!
కాదు!! మా గుండెలో సూర్యుడివి,మా పాలిట దేవుడివి ,మాలో ఒకడివి ....


Friday, September 4, 2009

MY TRIBUTE TO YSR

Abhivrudhdhi peru cheppi raithannanu velesthe
dhikkulekka edchi edchi visham thaagi chachchadu
gunde pagili raithu kosam kaali baata pattavu
palle palle velli valla kadupu kotha vinnavu
nenunnanantoo gunde dhairyam ichchavu
annadaathake aakalaithe puttagathulu levannavu
aakhari aashaga neeku pattam kadithe
nammakam vammu cheyaka maata nilabettukunnavu
paggalu andhagane uchitha vidyuththichchavu
purugu patti panta chedi raithu appula palai
athmabhimanam champukoleka thananu thaanu champukunte
andharu nivvera poyelaa runa maphi chesaavu
lekka leni dyaamulu katti nela thalli gonthu thadippavu
raithe rajani raithu pakshapathivayyavu
potta chetha batti janam valasa pothunte
aaganadi aagandantuu pani ichchi potta nimpaavu
illu leka pedha vaadu enda vaana ku edisthe
indhiramma gruhaalani inti vaadini chesaavu
dabbu leka janam jabbulatho chasthunte
aarogya sri modhaletti praana dhaathavayyavu
manchi rojulochchayini malli ninu aashagaa gelipisthe
mosam chesi nee dhhari nuvvvu choosukuntavaa???
adhyaksha antoo elugeththi maa badhalu lokaniki cheppe gonthu maaku lekunda chesthavaa??
nee swachchamian navvu maaku lekunda chesthavaa??
thagunaa neeku idhi thagunaa.....
thanaku poti antoo devude ninnu maya chesthe
ravaa marananni edhirinchi ravaa...
neevu leka janam dhiku leni vaallai vekki vekki edusthunnaru...
maa maata vinanani maa kalla neeru aaputakaina ravaa.....................

antha velugu velige suryudaina asthamisthaadu kadhaa....
asthaminchadaaniki nuvvu aakasham lo suryudivaaa!!!!
kaadhu maa gunde lo suryudivi maa palita devudivi maa lo okadivi....