బ్రతుకుకు భయపడి చస్తే కాదా అది హాస్యం.
చుట్టూ ప్రకృతిని ఒక్కసారి చూడు పరీక్షగా,
బ్రతకడం నేర్పుతుంది నీకు ఒక పెద బాల శిక్షలా.
ఉలి దెబ్బ తగలని రాయి శిల్పం అవుతుందా??
కష్టాల కొలిమిలో పడందే నీ తెలివి పదునెక్కుతుందా???
విత్తుని పూడ్చేస్తే అవుతుందా మరి సమాధి,
సత్తువతో నేల చీల్చి చెట్టై రాదా అది .
స్వేదం చిందించి కరిగించు నీకు ఎదురైన అవరొధిని,
నిర్వేదం తరిమిస్తే చేరుకోగలవు నీ పరమావధిని .
మోయలేని మేఘాల భారం తన పై మోపినా,
మౌనంగా రోదించు తప్ప మిన్ను విరిగి పడదుగా!!
లెక్కలేని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా,
మౌనంగా భరించు తప్ప గుండె బలం కోల్పోకురా!!
బాధలన్ని భరిస్తే కాదా ఆకశం హరివిల్లును కాన్చేది,
కష్టాలన్ని దాటితే కదా నువ్వు ఇలలో స్వర్గం చూసేది.
మలుపులెన్నో వున్నవని పోనంటుందా నది ముందుకు,
అలుపన్నది లేకుండా సాగదా ,పంటకు ప్రాణం అయ్యేందుకు.
ఈ జీవన పయనం లో మలుపులు లెక్క చేయకు మిత్రమా!
నలుగురికి మంచి చేస్తూ సాగిపో స్నేహమా !!
ఆ నలుగురే నీకు కష్ట సుఖాలలో తోడైతారు,
బ్రతికేందుకు బాసటగా నిలుస్తారు ......
P.S: IF U LIKE IT LEAVE A COMMENT, IF U DONT LIKE THEN WRITE A COMMENT CRITICIZING THE POST. BUT DONT FORGET TO GIVE A COMMENT......