Saturday, December 22, 2012

నేను

అందరిలో ఒక్కడు, ఆ ఒక్కడిని నేను
ఒక్కడిలో ఏమున్నది? ఒక్కడిలో ఎంతున్నది??
కుతూహలంతో ప్రయోగం చేశా నేనొక్కడినై .

నా ప్రతి సుఖంలో భాగస్వామి నేనే,
నా ప్రతి దుఃఖంలో ఓదార్పు నేనే,
నా ప్రతి ఆవేశంలో ఆలొచన నేనే,
నా ప్రతి ఆలోచనకు బీజం నేనే,
నా ప్రతి సంఘర్షణలో వైరిని నేనే,
నా ప్రతి యుద్ధంలో సైన్యం నేనే.

నాలో కళకు ప్రేరణ నేనే, ప్రేక్షకుడిని నేనే.
నా సంశయంలో విద్యార్థిని నేనే, గురువు నేనే 
నాలో భక్తికి ఆరాధ్యం నేనే, ఆరాధకుడిని నేనే

ఇలా ఒక్కడిలో శక్తి ఉన్నది, ఒక్కడిలో లోతున్నదని తెలిసే క్రమంలో 

ఎవరు తట్టని నా గుండె తలుపులు మూతపడ్డాయి,
ఎవరు స్పృశించని నా మనసు పొరలు బండబారాయి,
ఎవరు వాడని నా భావ వారధులు కూలిపోయాయి.

నాలోనే సమాజం ఉందని తెలిసే సరికి సమాజంలో నేను లేను,
ఒక్కడినే అందరయ్యే క్రమంలో, అందరిలో ఒక్కడవ్వడం మరిచా నేను.
       

9 comments:

  1. అందరిలో నువ్వు ఒక్కడివి కాదు. నీ కళకు నేను ప్రేక్షకుడిని. నీ కవిత కు అభిమానిని :)

    ReplyDelete
  2. ninnu nuvvu baaga telusukunnanduku abhinandanalu... tanani taanu telusukunna taravatha samajam lo bathakadam kashtam kadu kada.

    ReplyDelete
  3. nuvvu inta nijanga inta introvert aa? kadu ra ...

    ReplyDelete
  4. @rajiv
    nee abhimananiki naa dhanyavadhaalu..

    @rathod
    samajam lo brathakadaniki manaki samajaniki oka link avasaram kadha..aa link waeken avuthe it is a dangerous situation.

    @pushkar
    dont judge a book by its cover... :)

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. నీలో సృజనకు శంకరావం మేమవుతం, నీ బాధల్లో మరియు భావాల్లో భాగస్వామ్యులం మేమవుతం: all of us are destined to be together in this beautiful journey called LIFE

    ReplyDelete
  7. Chadivi anandincha,ardham chesukoni tharincha. Salahalaku suchanalaku thavu ledu. Aaskaramuu ledu. Idi kalmasham leni kala. Nannu maimaripinchindi chaala. Neeku naa manassumanjalulu.

    Veelainanthavaraku telugu lo sambhashiddam. Ade naa vaancha. Nee sahakaramu anduthundani aasistunnanu.

    sarvejana sukhino bhavantu

    ReplyDelete